కాంగ్రెస్ పార్టీకో దండం రా బాబు – జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్

-

jeevan reddy comments on congress party: కాంగ్రెస్ పార్టీకో దండం రా బాబు అంటూ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్ శివారులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్య కు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపినట్టు చెబుతున్నారు స్థానికులు. దింతో రోడ్ పై బైఠాయించారు జీవన్ రెడ్డి. అయితే ఆయనను శాంతిప జేయడానికి అడ్లూరి లక్ష్మణ్‌ రంగంలోకి దిగారు.

jeevan reddy comments on congress party

ఈ సందర్బంగా అడ్లూరి లక్ష్మణ్‌తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “మీకు.. మీ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలా బతకనివ్వండి”.. అంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. ఇలా అయినా మమ్మల్ని బతకనివ్వండి అన్నారు. ఇంతకాలం మానసిక అవమానాలకు గురవుతున్నా కానీ తట్టుకున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version