రైళ్లలో ఇచ్చే బెడ్ షీట్స్ ని ఎన్ని రోజులకు వాష్ చేస్తారు..? వామ్మో ఈసారి జాగ్రత్తగా ఉండాలి..!

-

చాలా మంది ట్రైన్ లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతుంటారు. రైళ్లలో ట్రావెల్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ట్రైన్ లో ట్రావెల్ చేయడానికి ఏసి కోచ్లు కూడా ఉంటాయి. మనం కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకుంటే ఏసీ లో కూడా వెళ్లొచ్చు. ట్రావెల్ చేసే వాళ్ళకి టవల్, బెడ్ షీట్లు, తల దిండులు కూడా ఇస్తారు. జర్నీ చేసేటప్పుడు ఇవన్నీ మనకి ఇచ్చినప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంటి నుంచి పట్టుకెళ్ళక్కర్లేదు.

చాలామంది పాసింజర్స్ వీటితో కంఫర్ట్ గా నిద్రపోతారు. అయితే ఎప్పుడెప్పుడు ఈ బెడ్ షీట్లను, తల దిండులని వాష్ చేస్తారు ఎన్ని సార్లు వాష్ చేయడం జరుగుతుంది అనే విషయాలని చూద్దాం. రైల్వే అందించే ఈ బెడ్ షీట్లు వంటి వాటిని వాష్ చేయడం విషయంలో ఇప్పటికే చాలా కంప్లైంట్ లు వచ్చాయి.

ప్రయాణికులు వీటిపై అనేకమార్లు ఫిర్యాదు చేశారు. దిండు కవర్లు, టవల్స్ ని వాడిన ప్రతిసారి కూడా వాష్ చేస్తారు. కానీ బెడ్ షీట్లు వంటి వాటిని మాత్రం నెలకి ఒకసారి వాష్ చేస్తారు. ఒకవేళ బెడ్ షీట్ తడిసిపోయిన లేదంటే మరకలు పడిన ప్రతిసారి వాష్ చేస్తారు ఒక్కోసారి రెండు నెలలకు ఒకసారి ఈ బెడ్ షీట్లను వాష్ చేస్తారని కూడా పలువురు చెప్తున్నారు. వీటిని వాడేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version