హేమా కమిటీ రిపోర్ట్.. నటి రోహిణి కీలక వ్యాఖ్యలు!

-

మళయాల చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్లు, మహిళా నటుల పట్ల వేధింపులు జరుగుతున్నట్లు ఇటీవల హేమా కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ రిపోర్ట్ నేపథ్యంలో నమోదు అయిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు మహిళా జడ్జిలతో కూడిన ప్రత్యేక బెంచ్ ని ఏర్పాటు చేశారు.

అదే తరహా కమిటీని తమ పరిశ్రమలోనూ ఏర్పాటు చేయాలని ఇతర పరిశ్రమలకు చెందిన సినీ నటులు కూడా కోరుకుంటున్నారు. ఈ తరుణంలో తమకు ఎదురైన వేధింపుల గురించి పలువురు నటీమణులు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నటి రోహిణి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం జరిగిన నడిగర్ సంఘం మీటింగ్ లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. లైంగిక వేధింపుల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు రోహిణి. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news