అబ్బో రవితేజ పెద్ద డేరింగ్ స్టెప్ వేస్తున్నాడే…..!!

-

కొన్నేళ్ల క్రితం శ్రీను వైట్ల తెరకెక్కించిన నీకోసం సినిమాతో హీరోగా మారిన నటుడు రవితేజ, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ అంతకముందు సహాయ నటుడిగా పలు సినిమాల్లో నటించిన అనుభవంతో మంచి పేరు అయితే దక్కించుకున్నాడు. ఆ తరువాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాలు హీరోగా రవితేజ కెరీర్ కు సూపర్ బ్రేక్ ని అందించాయి. ఇక అక్కడి నుండి టాలీవుడ్ లో మంచి పేరున్న స్టార్ హీరోగా మారిన రవితేజ, ఆ తరువాత పలు హిట్ సినిమాల్లో నటించాడు.

ఇక ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన రాజా ది గ్రేట్ తరువాత రవితేజ నటించిన సినిమాలేవీ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో కొంత ఆలోచనలో పడ్డ రవితేజ, అనంతరం తన తదుపరి సినిమాకు సైన్స్ ఫిక్షన్ సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ కు అవకాశం ఇచ్చాడు. గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలు తీసిన విఐ ఆనంద్, ప్రస్తుతం రవితేజతో డిస్కో రాజా అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక రెండు రోజులుగా ట్విట్టర్ వేదికగా ఆస్క్ డిస్కో రాజా క్వశ్చన్స్ లో భాగంగా, నిన్న ఒక అభిమాని ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్స్ నేపథ్యంలో లేదా ఏదైనా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారా ,ఒకవేళ అది నిజం అయితే దానికోసం ఏదైనా రీసెర్చ్ చేసారా అంటూ దర్శకుడు ఆనంద్ ని ప్రశ్నించాడు.

అనంతరం ఆనంద్ దానికి సమాధానం ఇస్తూ, ఇది కొంతవరకు సైన్స్ ఫిక్షన్ స్టోరీగా సాగుతుంది, అయితే ఎంతో బాగా రీసెర్చ్ చేసిన తరువాత ఈ సినిమా కథను అందరూ మెచ్చేలా తయారు చేసాం అని అన్నారు. సో, దీనికి బట్టి చూస్తుంటే మాస్ రాజా తొలిసారి డిస్కో రాజా ద్వారా ప్రయోగాత్మకమైన సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఆయనకు ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి…!!

Read more RELATED
Recommended to you

Exit mobile version