బిగ్​బాస్ హౌస్​లో శివాజీ రచ్చ.. తలుపు తీయకపోతే పగలగొట్టి వెళ్తా అంటూ వార్నింగ్

-

బిగ్​బాస్ సీజన్-7 తెలుగు షురూ అయింది. అప్పుడే శుక్రవారం వచ్చేస్తోంది. అయితే ఈ సీజన్​ కంటెస్టెంట్లలో ఒకరైన నటుడు శివాజీ.. కాస్త ఫైర్ మీద కనిపిస్తున్నాడు. లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ వచ్చే వరకూ కాఫీ తాగడానికి హౌస్‌లో అవకాశం లేకపోవడంతో నటుడు శివాజీ అసహనం వ్యక్తం చేస్తూ బిగ్​బాస్​పై ఫైర్ అయ్యాడు. ‘ఒక గంట చూస్తా.. ఎవడికీ భయపడను’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

శివాజీ ప్రవర్తన చూసిన బిగ్​బాస్.. బీపీ మిషన్‌ పంపి, ప్రతి ఒక్కరి రక్తపోటును చెక్‌ చేయమని డాక్టర్‌ గౌతమ్‌కు చెప్పడంతో శివాజీ కోపంతో మరింత ఊగిపోయారు. ‘ఏం చూస్తావు తమ్ముడు నువ్వు.. దాన్ని అక్కడ పెట్టు. బిగ్‌బాస్‌ బీపీ చూసుకో నీకు ఎక్కువైంది’ అంటూ మండిపడ్డారు. ‘నేను చాలా కిందకు ఉంటా. రెచ్చగొడితే మొత్తం పగలగొట్టి వెళ్లిపోతా. తలుపు తీయ్‌.. ఒక్క నిమిషం ఉంటే అడుగు’ అంటూ అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడటంతో హౌస్‌లో ఉన్న వాళ్లంత ఆశ్చర్యపోతూ చూశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version