తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఈనెల 6వ తేదీన జరగనుంది. ఇంతకు ముందు చాలాసార్లు ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ అయినా… ఇప్పుడు మాత్రం గురుశిష్యులు ప్రచారంలో ఉండి వీళ్లిద్దరు తొలిసారి సీఎంల హోదాలో కలవనుండటంతో రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.విభజన సమస్యలు పరిష్కారం కోసం చర్చించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపి ముందుగా లేఖ రాయగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రగతి భవన్ లో ఇద్దరు సీఎంల సమావేశం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఇద్దరు సీఎంలు కలుస్తున్నారు.. ఏమి జరుగుతుందో అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు 7 మండలాలు కలుపుకున్నారు.. భద్రాచలంలో చాలా భాగం ఆంధ్ర ప్రదేశ్ లో ఉందన్నారు. ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలని తెలిపారు. అలాగే..కార్పొరేషన్లలో 70 శాతం మంది ఆంధ్ర ప్రదేశ్ వాళ్లే ఉన్నారు.. వారిని వెంటనే అక్కడికి పంపించాలని అన్నారు. హైదరాబాద్లో ఉన్న 5 వేల ఎకరాలపై ఆంధ్ర ప్రదేశ్ కన్ను వేసింది.. వాటిని వదులుకోవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.