హీరోయిన్లను వేధిస్తున్న వారిని చెప్పుతో కొట్టాల్సిందేనని హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవడో ఒకడు పిచ్చి పట్టి ఆడవాళ్లను పిలుస్తారని… అలాంటప్పుడు ఆ మహిళల్లో ఆ వ్యక్తి ని భయపడకుండా చెప్పుతో కొట్టాలని కోరారు. తమిళ చిత్ర పరిశ్రమలోను అలా మహిళలను వేదించేవారు ఖచ్చితంగా ఉంటారు… అలాంటి వారిపై దైర్యం గా వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.
కేరళలో ఏర్పాటుచేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని… కేరళలో అలా ఆడవాళ్లను వేదించిన పాపానికి వారికి శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. మహిళలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి మగవారిపై ఉంటుందని తెలిపారు. శ్రీ రెడ్డి ఎవరో నాకు తెలియదు కానీ.. ఆమె వేసే జోకులు మాత్రం నేను విన్నానని చెప్పారు. ఎవరి మీద అయినా నిందలు వేయడం కొందరికి అలవాటుగా మారిందని ఆగ్రహించారు. నిజంగానే ఇబ్బందులు కలిపితే పోలీసులకు ఫిర్యాదు చెయ్యొచ్చన్నారు.