గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ కాజల్ అగర్వాల్.. కారణం..?

-

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందంతో ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉండేది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇక వివాహమైన తర్వాత అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం తనకు అవకాశాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం జరుగుతోంది. ఇటీవలే ఒక కుమారుడికి కూడా జన్మనిచ్చి తల్లిగా కూడా మారిపోయింది. ఇక ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కానీ ఎప్పుడైతే కాజల్ వివాహం కుదిరిందో అప్పటినుంచి తన ముఖంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఎవరికైనా సరే వయసు మీద పడుతున్న కొద్ది ముఖంలో మార్పులు రావడం సహజమని చెప్పవచ్చు.

మనం తాజాగా కాజల్ షేర్ చేస్తున్న కొన్ని ఫోటోలు చూసినట్లు అయితే ఆమె ముఖము కూడా చాలా ఉబ్బినట్లు పెదాలు ఏదో ప్లాస్టిక్ సర్జరీ ఫెయిల్యూర్ అయితే ఎలా వుంటాయో అలా కనిపిస్తోంది. కానీ వివాహం సమయంలో కూడా ఈమె ఇలాగే కనిపించింది కానీ అభిమానులు మాత్రం మేకప్ వల్ల ఆమె అలా కనిపిస్తోందని అనుకున్నారు. కానీ రాను రాను కాజల్ ముఖంలో స్పష్టమైన మార్పులు కూడా కనిపించడం మొదలయ్యాయి. ఇక ఒక కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత తన ముఖంలో ఇలాంటి లక్షణాలూ మరిన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.

ఇక కాజల్ సోదరి నిషా అగర్వాల్ కాజల్ భర్తకి రాఖీ కడుతున్న సందర్భంగా ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇక తన భర్తతోపాటు కాజల్ చాలా హడావిడి చేసినట్లుగా కనిపిస్తోంది .అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటోలో కాజల్ ను చూసిన వారంతా కూడా ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు. కాజల్ కి ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ వికటించిందా అన్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చందమామ లాగా ఉండే కాజల్ ఇలా మారిపోయింది ఏంటి అంటూ అభిమానులు చాలా నిరుత్సాహ చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version