తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ ప్రణీత గురించి పరిచయం అవసరం లేదు. తన అందంతో, చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా గ్లామర్ షో చేస్తుందని చెప్పాలి. “ఏం పిల్లో ఏం పిల్లడో” సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత” బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస” వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే గత ఏడాది రహస్యంగా వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. లాక్ డౌన్ సమయం లో వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది ప్రణీత.
ఇక తర్వాత ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మళ్లీ తనను తాను సన్నజాజి తీగలా మార్చుకునేందుకు జిమ్లో చెమటోడుస్తోంది. అంతేకాదు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా మునుపటి అందంతో హల్చల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ ఇకపోతే గ్లామర్ షో చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది. థైస్ అందాలు చూపిస్తూ.. మరొకవైపు నడుము నాభి అందాలతో పిచ్చి లేపుతోంది. ఇక ఈమెను చూసిన కుర్ర కారు సైతం తల్లి అయినా కూడా ఇంత అందంగా ఉండడం ఏంటి అంటూ కూడా వారే ఆశ్చర్యపోతున్నారు.
అయితే పెళ్లి అయ్యి పిల్లలు జన్మించిన తర్వాత కూడా ఇదే అందం మైంటైన్ చేయడం అంటే చాలా కష్టం. ఇక దీనికి ప్రణీత ఎంత కష్టపడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ క్రమంలోనే తాను మళ్ళీ సన్నబడ్డానని నిరూపించడానికి ఇలా వరుస గ్లామర్ ఫోటోలను వదులుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇక మరి కొంతమంది ఏమో ప్రణీత మళ్లీ సినిమాలలోకి అవకాశం ఇవ్వడానికి ఇలా ట్రై చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.