ఇది బంగారు తెలంగాణనా? తాలిబన్ల రాజ్యమా? – వైఎస్ షర్మిల

-

ఇది బంగారు తెలంగాణనా? తాలిబన్ల రాజ్యమా? అని కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదా ? అని నిలదీశారు. ప్రశ్నించే గొంతుకను అణగదొక్కుతారా? ఇది బంగారు తెలంగాణనా? తాలిబన్ల రాజ్యమా? నిరుద్యోగ దీక్ష చేయకుండా అడ్డుకుంటారా? మీరు ఎన్ని కుట్రలు చేసినా మా పోరాటం ఆగదు. నిరుద్యోగుల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు షర్మిల.


YSR గారు రూ.350 కోట్లతో పూర్తి చేయాలనుకున్న మంచిప్ప రిజర్వాయర్ ను KCR కమీషన్ల కోసం రూ.3500కోట్లకు పెంచారు. 4000 కుటుంబాలు.. భూములు కోల్పోతామన్న భయంతో బతుకుతున్నారు. గిరిజన రైతులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. గిరిజనులకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించిన ఏకైక నాయకుడు వైయస్ఆర్.పోడు పట్టాలతో పాటు రేషన్ కార్డులు, యంత్రలక్ష్మీ మంజూరు చేశారు. పింఛన్లు, పక్కా ఇండ్లలోనూ ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version