లూసిఫర్ రీమేక్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తోన్న హీరోయిన్లు

Join Our Community
follow manalokam on social media

చిరంజీవి ‘లూసిఫర్’ కన్‌ఫ్యూజన్స్‌ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎంతమంది డైరెక్టర్లు మారినా, సినిమా లాంచ్‌ అయినా, ‘లూసిఫర్’ మాత్రం డైలమా నుంచి బయటపడట్లేదు. మెగాస్టార్‌కి హీరోయిన్‌ని పెట్టాలా వద్దా.. పెడితే ఎవరిని తీసుకోవాలి అని టీమ్ మొత్తం మేదోమధనాలు చేస్తోంది.

చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ చెయ్యాలనుకున్నప్పటి నుంచి పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ముందు డైరెక్టర్‌గా ఎవరిని తీసుకోవాలి అని తర్జనభర్జనలు పడిన చిరంజీవి అండ్ టీమ్ ఫైనల్‌గా మోహన్‌రాజాని ఓకే చేసింది. సుజిత్, వినాయక్‌ లాంటి వాళ్లని పరిశీలించి ఫైనల్‌గా చెన్నై నుంచి మోహన్‌రాజాని తీసుకొచ్చారు.

మోహన్‌రాజా వచ్చి ‘లూసిఫర్’ రీమేక్‌ని మొదలుపెట్టేశాడు గానీ, ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఒరిజినల్‌లో లేని హీరోయిన్ క్యారెక్టర్‌ని రీమేక్‌లో యాడ్ చేశాక ఎవరిని తీసుకోవాలి అనే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మెగాస్టార్‌ బాడీ లాంగ్వేజ్‌కి సెట్‌ అయ్యేలా నయనతారని తీసుకోవాలా, త్రిషను పట్టుకురావాలా అని చర్చిస్తూనే ఉన్నారట.

నయనతార ఇంతకుముందే చిరంజీవితో ‘సైరా’ సినిమా చేసింది. మళ్లీ ఈ కాంబినేషన్‌ని రిపీట్‌ చేస్తే బావుంటుంది అనుకుంటున్నాడట దర్శకుడు. ఒకవేళ నయనతార సెట్‌కాకపోతే త్రిషని తీసుకోవాలనుకుంటున్నాడట. ‘స్టాలిన్’ జోడీని రిపీట్ చేస్తే బావుంటుందని ప్లాన్‌ చేస్తున్నాడట. కానీ త్రిష ‘ఆచార్య’కే హ్యాండ్‌ ఇచ్చి వెళ్లిపోయింది. అలాంటిది మళ్లీ ‘లూసిఫర్’ రీమేక్‌కి ఓకే చెప్తుందా అన్నది చూడాలి.

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...