రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో రేపు తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,723 గ్రామపంచాయితీల్లో పోలింగ్ జరగనుంది… ఉదయం 6.30 గంటలకే ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది… మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మధ్యహ్నం 3.30 వరకు పోలింగ్ జరగనుంది… మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 వరకే పోలింగ్ నిర్వహిస్తారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా 525 గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవంగా అయ్యాయి.
జిల్లాల వారీగా ఎయె పార్టీలు గెలిచాయి అనేది చూస్తే. అన్ని జిల్లాలలో 525 ఏకాగ్రీవాలు జరిగితే అందులో వైసీపీ 498 గెలుచుకోగా, టీడీపీ 18 స్థానాలు గెలిచింది. ఇతరులు ఏడు స్థానాలు గెలుచుకున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో ఓ గ్రామ పంచాయితీలో సర్పంచ్ పదవికి, వార్డు సభ్యులుగా ఎవరూ నామినేషన్ వేయలేదు… దీంతో మిగిలిన 2,723 పంచాయితీల్లో సర్పంచ్ పదవికి పోలింగ్ జరగనుంది. మొత్తం 32,502 వార్డులు ఉండగా 12,185 ఏకగ్రీవమయ్యాయి.. మరో 152 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 20,160 వార్డ్ లకు పోలింగ్ నిర్వహిస్తారు.