Bhagavanth kesari : బాలయ్య తో మరోసారి స్టెప్పులు వేయనున్న హానీ రోజ్!

-

నందమూరి బాలయ్య గురించి తెలియని వారుండరు. అయితే.. నందమూరి బాలయ్య హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. మాస్ యాక్షన్ జోనర్ లోనే ఈ కథ నడవనుంది. సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి రీసెంట్ గా ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ పట్ల… బాలకృష్ణ లుక్ పట్ల ఆయన అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

నిన్న బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. ‘అడవి బిడ్డా…నేలకొండ భగవంత్ కేసరి’ అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ బాలకృష్ణ యాక్షన్ లోకి దిగిపోవడం ఈ టీజర్ లో కనిపిస్తోంది. ‘ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది’ అనే బాలయ్య డైలాగ్ తో ముగించారు. తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టనున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ఐటెం సాంగ్‌ ఉండనుందని.. అందులో హనిరోజ్‌ నటించబోతుందని సమాచారం. దీనికి ఈ బ్యూటీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version