రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్..!

-

‘RRR’ విశేష ఆదరణ సొంతం చేసుకున్న రామ్ చరణ్  తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైకు చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈమేరకు ఏప్రిల్ 13న జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కళా రంగానికి చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ అందిస్తున్నట్లు స్థానిక ప్రతికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘RRR’ ‘ఆచార్య’ తర్వాత రామ్  చరణ్ నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్, శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయిక, పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఇది సిద్ధమవుతోంది. అంజలి, ఎస్.జె.సూర్య, జయరామ్, సునీల్, నాజర్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబుతో చరణ్ ఇటీవల కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. జాన్వీకపూర్ కథానాయిక, దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news