గెటప్ శ్రీను మొదటి సంపాదన ఎంతంటే..?

-

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని రకరకాల గెటప్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు బుల్లితెరపై మొదలు పెట్టిన నాటి నుంచి సంవత్సరాలు గడుస్తున్నా జనంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో నడుస్తున్న కామెడీ షో లో ఈయన తన కామెడీతో ప్రేక్షకులను అలరించి మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ షోలో నటించిన ఎందరో ఆర్థికంగా నిలబడడమే కాకుండా సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకోవడం.. అది హిట్ కావడంతో గెటప్ శ్రీనుకి మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు చిరంజీవి నటించిన సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు గెటప్ శ్రీను. తాజాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా గెటప్ శ్రీను నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఏకంగా 10 లక్షల రూపాయల పారితోషకం తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన మొదటి పారితోషకం ఎంత అని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

శ్రీను మొదటి పారితోషకం కేవలం రూ.40 మాత్రమే..ఎన్నో కష్టనష్టాలు పడుతూ జబర్దస్త్ లోకి చేరి ఆ తర్వాత పాపులారిటీ దక్కించుకున్నాడు. మొదట్లో సుడిగాలి సుదీర్ టీం లో చేస్తూ తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు ఇప్పుడు హీరోగా కూడా అవతారం ఎత్తారు గెటప్ శ్రీను.. “యాదమ్మ రాజు” సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇదివరకే 3 మంకీస్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోలో హీరోగా ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version