ఇన్నాళ్ళ నా కెరియర్లో విజయ్ లాంటి హీరోని చూడలేదు.. శ్రీకాంత్..

-

తమిళ హీరో దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా వరిసు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం వచ్చాడా అది సంక్రాంతికి విడుదల కాబోతుంది అయితే తాజాగా దీనికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక చెన్నైలో జరగగా.. ఈ కార్యక్రమానికి హాజరైన హీరో శ్రీకాంత్ విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు..

 

దళపతి విజయ్ ప్రధాన పాత్రలో రాబోతున్న వరిసు చిత్రాన్ని తెలుగులో వారసుడిగా విడుదల చేయబోతున్నారు.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేయబోతున్నారు అలాగే ఇందులో విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్గా కనిపించనుంది.. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా తాజాగా ఆడియో రిలీజ్ వేడుకను పూర్తి చేసుకుంది.. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు అలాగే ఇందులో భాగంగా హీరో శ్రీకాంత్ తలపతి విజయ్ కోసం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. హీరో విజయ్ రియల్ లైఫ్ సూపర్ స్టార్ అని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్ ఇన్నాళ్లో నేను ఎప్పుడూ ఇలాంటి హీరోని చూడలేదని అన్నాడు అలాగే నా కెరియర్లో 125 సినిమాలు తీసిన విజయ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు అలాగే ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అందులో ఎలాంటి అనుమానం లేదంటూ ఇదేమో వ్యక్తం చేశారు..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంక్రాంతికి విడుదలయ్యే చాలా సినిమాలు బరిలో ఉన్నాయి.. దీనిలో నందమురి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు సైతం ఉన్నాయి.. అయితే పోటీ మాత్రం ఈ సంక్రాంతికి గట్టిగా ఉంటుందని చెప్పాలి ఈ సందర్భంగా దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లను ఈ చిత్రం కోసం బ్లాక్ చేసి పెట్టారనే వాదనలు కూడా వినిపించాయి అయితే ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు దిల్ రాజు..

Read more RELATED
Recommended to you

Exit mobile version