అలాంటి సినిమాలకి పారితోషికం గురించి అస్సలు ఆలోచించను.. జగపతి బాబు.

-

హీరోగా మానేసి విలన్ వేషాలు మొదలు పెట్టినప్పటి నుండి జగపతి బాబు చాలా సక్సెస్ అయ్యారు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన చేస్తున్న సినిమాల లిస్టు చాలా పెద్దగా ఉంది. స్టార్ హీరో సినిమా అనగానే అందులో విలన్ గా జగపతి బాబు గారిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే అదే జగపతి బాబు గారిని చిన్న సినిమాలకి దూరం చేసిందనే చెప్పాలి. తాజాగా ఆహాలో రిలీజైన కలర్ ఫోటో చిత్రంపై స్పందించిన జగపతు బాబు గారు చిత్ర యూనిట్ ని మెచ్చుకుంటూ, తనకి ఇలాంటి సినిమాల్లో ఎందుకు అడగరంటూ ప్రశ్నించాడు.

క్రియేటివ్ గా కొత్తదనంతో నిండి ఉంటే చిన్న సినిమాల్లో అయినా తాను చేస్తానని, పారితోషికం గురించి పెద్దగా ఆలోచించనని, బయట వచ్చే వార్తలన్నీ అవాస్తవాలని అన్నారు. కలర్ ఫోటో లాంటి సినిమాల్లో భాగం అయితే సంతోషిస్తానని చెప్పుకొచ్చాడు. మరింకేం చిన్న దర్శకులు స్క్రిప్టులు రెడీ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news