నా జీవితంలో వీరిద్దరిని ఎప్పటికీ మరిచిపోను.. జయసుధ..!

-

ప్రముఖ స్టార్ హీరోయిన్.. సహజనటి జయసుధ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. మద్రాస్ లో పుట్టి పెరిగిన ఈమె స్వయానా విజయనిర్మలకు మేనకోడలు.. ఈమె ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి వచ్చిన జయసుధ ఆ తర్వాత హీరోయిన్ గా మారి 20 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసి కోట్లాదిమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. ఇదిలా ఉండగా తాజాగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి అమ్మ, అక్క, వదిన ఇలా పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న ఈమె ఇప్పుడు నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే సీజన్ 2 లో పాల్గొనింది.

ఈ కార్యక్రమానికి జయసుధ తో పాటు సీనియర్ స్టార్ హీరోయిన్ జయప్రద ..యంగ్ బ్యూటీ రాశిఖన్నా కూడా హాజరయ్యారు. నిన్న బయటకు వచ్చిన ఈ ఎపిసోడ్ ఎంతో సరదాగా.. ఇంట్రెస్టింగ్ గా మరియు ఎమోషనల్ గా సాగింది. జయసుధ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలను వెల్లడిస్తూ ఎమోషనల్ అయింది.. జయసుధ మాట్లాడుతూ..” నా భర్త నితిన్ కపూర్ ఐదు సంవత్సరాల క్రితమే మరణించారు . ఒక భార్యకి భర్త చనిపోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు. అయితే నా భర్త చనిపోయినప్పుడు నాకు చెప్పకుండా దాచేశారు.

నేనప్పుడు వేరేచోట సినిమా షూటింగ్లో ఉన్నాను. అయితే నా పిల్లలు బాలకృష్ణకు చెప్పి అమ్మకు అప్పుడే చెప్పొద్దు అని చెప్పారు.. నా భర్త బాలకృష్ణ యంగ్ ఏజ్ నుంచి బాగా క్లోజ్. అయితే నా భర్త చనిపోయినప్పుడు నాకు చెప్పకపోవడం నా జీవితంలో జరిగిన అతిపెద్ద ఘోరం అంటూ తన మనసులో మాట చెప్పుకొని కన్నీరు మున్నీరయింది జయసుధ. అలాగే తన భర్త చనిపోయినప్పుడు బాలకృష్ణ , జయప్రద తనకు అండగా నిలిచారని కూడా తెలిపింది. ఎప్పటికీ నా జీవితంలో వీరిద్దరిని మరిచిపోను” అంటూ తెలిపింది జయసుధ.

Read more RELATED
Recommended to you

Exit mobile version