akhanda pre release : బాల‌య్య కోసం ఐకాన్ స్టార్

-

నందమూరి బాల కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న సినిమా అఖండ‌. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న హైద‌రాబాద్ లోని శిల్ప క‌ళా వేదిక లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా హాజ‌రు కాబోతున్నారు. ఈ విష‌యాన్ని అఖండ చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

కాగ ఈ ఈవెంటు కు ముందుగా ఎన్టీఆర్ తో పాటు నేచుర‌ల్ స్టార్ నాని వ‌స్తార‌ని అంద‌రూ భావించారు. కానీ అల్లు అర్జున్ ను బాల‌య్య కోసం రంగం లో కి దించారు. అయితే బాల‌య్య కు అల్లు అర్జున్ కు మ‌ధ్య మంచి అనుభందం ఉంది. అలాగే డైరెక్టర్ బోయ‌పాటి శ్రీ‌ను తో కూడా అల్లు అర్జున్ స‌రైనోడు సినిమా చేశాడు. అయితే అఖండ సినిమా అగ్ర హీరో బాల‌కృష్ణ, స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో వ‌స్తుంది. ఇప్ప‌టి కే ఈ సినిమా నుంచి ట్రైల‌ర్ విడుద‌ల అయి.. అంచనా ల‌ను భారీ గా పెంచింది. అలాగే ఈ సినిమా నుంచి రెండు పాట లు కూడా విడుదల అయ్యాయి. కాగ అఖండ సినిమా ను థీయేట‌ర్ల‌లో ఈ వ‌చ్చే నెల 2 న విడుద‌ల చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news