టాలీవుడ్ హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే కండీషన్స్ అప్లై అంటున్నారా …?

-

రెండు నెలలకు పైగా టాలీవుడ్ లో షూటింగ్స్ తో సహా అన్ని కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఇలాంటి దారుణమైన పరిణామాలు తలెత్తడం ఇదే ప్రథమం. అయితే సినీ ఇండస్ట్రీ పెద్దలు తమకు షూటింగ్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకోవడానికి అనుమతులు కోరూతు ముఖ్యమంత్రిని కలిసి చర్చలు జపిన సంగతి తెలిసిందే. దాంతో ముఖ్య మంత్రి కూడా కరోనా నిబంధనలతో అనుమతులు ఇచ్చారు. ఈ నేథ్యంలో జూన్ 15 నుండి ఇప్పటికే 40 శాతం షూటింగ్ అయిన సినిమాలన్ని చిత్రీకరణకి సిద్దమవుతున్నాయి.

 

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా హీరో, హీరోయిన్స్ సహా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్స్ అందుకునే టెక్నీషియన్స్ ని తమ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవమని తద్వారా నిర్మాత కాస్త సినిమా నిర్మాణం ఖర్చు తగ్గుతుందని రిక్వెస్ట్ చేస్తున్నారట. వాస్తవంగా ఇదే విషయం సినీ పెద్దలు సూచించారు. అయితే అందుకు హీరో హీరోయిన్స్ తో పాటు అందరూ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది.

కాని హీరోలు మాత్రం చిన్న మెలిక పెట్టినట్టు సమాచారం. ఇప్పటి వరకు వాళ్ళు అందుకుంటున్న రెమ్యూనరేషన్ లో సినిమాని బట్టి రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నట్టు తెలిపినప్పటికి లాభాలలో మాత్రం వాటా కావాలంటూ ప్రతిపాదన తెస్తున్నారట. వాస్తంగా అయితే ఇంతక ముందు కూడా కొన్ని సినిమాలకి స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా శాటిలైట్ బిజినెస్, సినిమా లాభాలలో వాటాల రూపంలో రెమ్యూనరేషన్ అందుకున్నారు. అయితే ఇప్పుడు ఈ పద్దతి అందరి హీరోలు ఫాలో కావాలని చూస్తున్నారట. మరి నిర్మాత హీరో మధ్య ఈ ఒప్పందం బాగానే ఉంటుందని చెపుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version