కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ ఈ వయసులో కూడా అంతే ఎనర్జిటిక్ గా కనిపిస్తూ.. వరుసగా సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఐదు పదుల వయసు దాటితేనే చాలామంది వృద్ధాప్య లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ రజనీకాంత్ మాత్రం ఆరు పదుల వయసు దాటినా కూడా అంతే ఎనర్జిటిక్ గా కనిపించడానికి కారణం వేరే ఉంది అని చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు.. అసలు విషయంలోకెళితే రజినీకాంత్ తరచుగా హిమాలయాలను సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన సినిమా విడుదలయితే తప్పకుండా ఇక్కడికి మనశ్శాంతి కోసం వెళ్తూ ఉంటారని చెబుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ తొలిసారి హిమాలయాలకు ఎప్పుడు వెళ్లారు..? ఆయనకు హిమాలయాలతో అనుబంధం ఎలా ఏర్పడింది ?అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కరోనా కారణంగా గత నాలుగు సంవత్సరాలుగా అక్కడికి వెళ్లలేకపోయిన జైలర్ సినిమా విడుదల సందర్భంగా హృషీకేష్ ను సందర్శించారు. స్వామి దయానంద సరస్వతి స్వామీజీ రజినీకాంత్ ఆధ్యాత్మిక గురువులలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1992 – 93 మధ్యకాలంలో రజనీకాంత్ మొదటిసారి స్వామి దయానంద సరస్వతి స్వామీజీని చెన్నైలో కలవగా హిమాలయాలకు రావాలని ఉందని స్వామితో చెప్పారట.
అయితే అక్కడికి రావడం అనుకున్నంత సులువు కాదు అని.. అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని..ముందుగానే సూచించారు. అక్కడికి వస్తే.. హృషీకేశ్ లోనే తమ ఆశ్రమంలోనే ఉండాలని రజనీకి చెప్పారట. ఆ తర్వాత రజనీకాంత్ చాలా సందర్భాలలో అక్కడికి వెళ్లి అలా అనుబంధం ఏర్పరచుకున్నారు. అక్కడ ఆయనకి ఆధ్యాత్మిక గురువులు చాలామంది ఉన్నారని.. వారందరినీ కలిసిన తర్వాతనే ఇంటికి వెళ్తారని సమాచారం. ఇకపోతే హిమాలయాల్లో సన్యాసులను కలిసి పూజలు చేస్తారని , వారు ఇచ్చే తాయత్తులు, వేర్ల వల్లే ఇంత పవర్ ఫుల్ గా ఉన్నారని రజనీకాంత్ స్నేహితుడు రాజ్ బహదూర్ తెలిపారు.