అధికార బిఆర్‌ఎస్ పార్టీలో సీట్ల అంశంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి ఎవరికి సీటు దక్కుతుందో..ఎవరికి దక్కదో క్లారిటీ లేకుందా ఉంది. ఇక సీట్ల కోసం ఎదురుచూస్తున్న సీనియర్ల పరిస్తితి ఏం అవుతుందనేది అర్ధం కాకుండా ఉంది. వారికి సీట్లు దక్కకపోతే బిఆర్‌ఎస్ కు వీడ్కోలు పలుకుతారా? అనే డౌట్ కూడా ఉంది.
ఇదే క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డిల పొజిషన్ ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు. ఒకప్పుడు ఇద్దరు నేతలు టిడిపిలో కీలకంగా వ్యవహరించారు. రంగారెడ్డిలో పట్నం, ఖమ్మంలో తుమ్మల హవా నడిచేది. తెలంగాణ విభజనలో టిడిపి నష్టపోవడంతో బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. 2014లో పట్నం తాండూరు నుంచి గెలిచి మంత్రి అయ్యారు. ఇటు తుమ్మల ఎమ్మెల్సీగా మంత్రిగా అయ్యారు. మధ్యలో పాలేరు ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అలా ఇద్దరు నేతలు 2018 ముందు వరకు బాగానే హవా చాటారు.
కానీ 2018 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. పాలేరులో తుమ్మల, తాండూరులో పట్నం ఓడిపోయారు. ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్ధుల చేతిలో ఓడిపోయారు. ఇక వీరిపై గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి…బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. అక్కడ నుంచి బిఆర్‌ఎస్ లో తుమ్మల, పట్నం హవా తగ్గింది.
ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వారికి సీట్ల విషయంలో గ్యారెంటీ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని కేసిఆర్ అన్నారు. దీంతో తుమ్మల, పట్నం పరిస్తితి అయోమయంలో పడింది. ఇక వీరికి సీట్లు ఇస్తే బిఆర్‌ఎస్ లో ఉంటారని, లేదంటే కాంగ్రెస్ లోకి జంప్ అవుతారని ప్రచారం ఉంది. చూడాలి మరి వీరికి సీట్ల విషయంలో కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.