తెలుగు డైరెక్టర్స్ కూతుర్ల టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

-

సినిమా కథ ఎలా ఉన్నా సరే.. ఒక సత్తా ఉన్న డైరెక్టర్ చేతిలో పడింది అంటే కచ్చితంగా ఆ సినిమా కథ ఊపిరి పోసుకుంటుందని చెప్పాలి. అందుకే డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది మూవీ అనడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఒక దర్శకుడు తన అభిరుచికి తగ్గట్టుగా తాను తీసుకునే నిర్ణయాలు కూడా సినిమా విజయాన్ని నిర్ణయిస్తాయని చెబుతూ ఉంటారు. అలా మన ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారనే చెప్పాలి. ఇదిలా ఉండగా సినిమా దర్శకులే కాదు దర్శకుల కూతుర్లు కూడా తమ టాలెంట్ తో అందరిని అబ్బురపరుస్తున్నారు. ఇక వారెవరో ఇప్పుడు చూద్దాం.

సుకుమార్ – సుకృతి వేణి:
సుకుమార్ కూతురు సుకృతి వేణి గురించి ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం లేదని చెప్పాలి. వయసులో చిన్నదైనా సరే తన అద్భుతమైన గాత్రంతో అందరిని అలరిస్తోంది. అర్బన్ జాయిన్ విత్ సుకృతి అనే యూట్యూబ్ ఛానల్ ను కూడా మెయింటైన్ చేస్తున్న ఈ చిన్నారి ఆ ఛానల్ ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకుంటోంది.

డైరెక్టర్ తేజ – ఐలా తేజ:
ప్రముఖ డైరెక్టర్ తేజ కూతురు ప్రస్తుతం అమెరికాలో హాయ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ బర్కెలీ లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఒక వైపు చదువుకుంటూనే మరొకవైపు స్పీకర్ గా బర్కెలీ ఫోరం తరపున పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.

పూరీ జగన్నాథ్ – పవిత్ర:
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లు అందుకొని భారీ పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన కూతురు పవిత్ర ఇండస్ట్రీకి ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై.. త్వరలోనే నిర్మాతగా మారబోతోంది.

గుణశేఖర్ – నీలిమ గుణ:
డైరెక్టర్ గుణశేఖర్ పెద్ద కూతురు నీలిమ గుణ నిర్మాతగా పలు సక్సెస్ఫుల్ సినిమాలకు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే చిన్న కూతురు కూడా ఇండస్ట్రీకే వస్తానని చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news