అనసూయ షేర్ చేసిన వీడియో చూస్తే.. ఆశ్చర్య పోవాల్సిందే..!!

-

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ అనసూయ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బుల్లితెరపై ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో కూడా బిజీగా ఉన్నది. ఇక అంతే కాకుండా అప్పుడప్పుడు నెటిజన్ల చేతిలో ట్రోలింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటుంది అనసూయ. ఇక జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పిన అనసూయ.. తెలుగు ఇండస్ట్రీలో కాకుండా ఇతర భాషలలో కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఉన్నది.

ఇప్పటికే తెలుగులో అనసూయ రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా, పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించింది. పుష్ప సినిమా తర్వాత అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పవచ్చు. దీంతో పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించే అవకాశాలు కూడా వస్తూనే ఉన్నాయి. అనసూయ సినిమాలలోనే కాకుండా పలు స్పెషల్ సాంగ్ లలో కూడా నటిస్తూ ఉన్నది. అనసూయ తన జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించి విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని చేయడం జరిగింది ఆమె ఆ వీడియోలో మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాలోని ఒక పాటకు డాన్స్ వేస్తూ ఉండేటువంటి ఒక వీడియోని షేర్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు సైతం ఒక్కొక్కరు ఒక విధంగా పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version