ఇప్పుడు ఇండియన్ 2 ప్రమాదంతో ఒక్కసారిగా తమిళ సినీ పరిశ్రమ భయపడే పరిస్థితి ఏర్పడింది. అగ్ర దర్శకుడు చేస్తున్న సినిమాలో కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. కాని చిత్ర యూనిట్ మాత్రం మా తల రాత అంటుంది. ఇప్పటి వరకు దర్శకుడు గాని, హీరో గాని మిగిలిన యూనిట్ గానీ ఇంకా ఈ చిత్ర విషాదం నుంచి బయటకు రాలేదు అనే చెప్పాలి.
ముఖ్యంగా హీరో, దర్శకుడి కేంద్రంగానే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ తరుణంలో కేసులు కూడా వారిని బాగానే ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఆగ్రహం ఉంది. ఇప్పుడు విచారణ కూడా జరుగుతుంది. ఇక అది అలా ఉంటే హీరో కమల్ హాసన్ మృతుల కుటుంబాలకు తలో కోటి రూపాయలు ఆర్ధిక సహాయం చేసారు.
తాజాగా దర్శకుడు శంకర్ కూడా వారికి తన వంతు ఆర్ధిక సహాయం చేసారు. ఒక్కొక్కరికి కోటి రూపాయల ఆర్ధిక సాయం చేసారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ‘ఈ ప్రమాదం తాలుకు షాక్ నుండి నేను ఇంకా కోలుకోలేదు. ఆ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకొన్నానన్న భావన కంటే యూనిట్ సభ్యులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారన్న బాధే ఎక్కువగా ఉంది. ఎంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా ఊహించని విధంగా జరిగిన ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను” అని ఆయన కామెంట్ చేసారు.