టాలీవుడ్‌పై బాలీవుడ్ భామ‌ల దండ‌యాత్ర‌.. ఇప్పుడు మ‌రో హీరోయిన్‌

-

అదేంటో గానీ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ల‌క్ ప‌రీక్షించుకుని.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్లి స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ప్రీతి జంతా నుంచి మొదలుకొని దిశాప‌టాని వ‌ర‌కు అంతా ముందుగా టాలీవుడ్‌లో న‌టించిన వారే. ఇక్క‌డ అవకాశాలు రాకున్నా.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

ఇప్పుడు ఆలియా భ‌ట్ కూడా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ అమ్ముడు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోంది. ఇక ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ తో మ‌రో సినిమా చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు త్వరలోనే మరో బాలీవుడ్ స్టార్స్ ఫ్యామిలీ నుండి ఓ కుర్రభామ తెలుగులో అడుగుపెడుతోంద‌నే సూచనలు కనిపిస్తున్నాయి. సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ టాలీవుడ్‌పై క‌న్నేసింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉంది. త్వ‌ర‌లోనే టాలీవుడ్‌లోకి కూడా స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఎవ‌రితో వ‌స్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news