అక్కినేని హీరోలకి ఈ ఇయర్ కరోనా ఎఫెక్ట్ దారుణంగా పడిందా …?

-

అక్కినేని నాగార్జున మన్మధుడు 2 తర్వాత మళ్ళీ ఏ సినిమాలో నటించలేదు. ప్రస్తుతానికి బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ ఇయర్ రిలీజ్ కావాలి. అలాగే వైల్డ్ డాగ్ అన్న సినిమాలోను నటిస్తున్నాడు. ఇవి రెండి సినిమాలు ప్రస్తుతం ప్రొడక్షన్స్ లోనే ఉన్నాయి. ఇక ఇంతకముందు వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కాల్సింది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధిన న్యూస్ ఏది రావడం లేదు. అంటే నాగార్జున నుండి వస్తే ఒక్క వైల్డ్ డాగ్ అన్న సినిమా మాత్రమే ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది.

 

ఇక నాగార్జున తనయుడు నాగ చైతన్య ప్రస్తుతం ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. మజిలీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. లవ్ స్టోరీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా కారణంగా పెండింగ్ పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో మళ్ళీ ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది క్లారిటి లేదని సమాచారం.

ఇక అక్కినేని నాగార్జున రెండవ కొడుకు అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుంది. అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా ప్రస్తుతం ఎప్పుడు రిలీజ్ చేయాలన్నది క్లారిటి లేదని సమాచారం. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరగాల్సి ఉందట. అసలే అఖిల్ కి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్ని ఫ్లాప్స్ గా మిగిలిన సంగతి తెలిసందే. దాంతో ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సస్ దర్శకుడు భాస్కర్ కి ఎంతో కీలకం.

Read more RELATED
Recommended to you

Exit mobile version