అమితాబ్ వాట్సాప్ తొలగించండి…! 700 మంది కంప్లైంట్‌

-

కరోనా వైరస్ ఈ స్థాయిలో ఉన్న తరుణంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆయన వరుస ట్వీట్ లు చేస్తూ ఆందోళనకు గురి చేస్తున్నారు. దీనితో ఒక ట్విట్టర్ యూజర్ ఫేస్బుక్ యాజమాన్యానికి ఒక పిటీషన్ వేసారు. అమితాబ్ బచ్చన్ మరియు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తమ మొబైల్ ఫోన్ల నుండి వాట్సాప్ ను తొలగించాలని వాట్సాప్ యాజమాన్య సంస్థ ఫేస్బుక్ ని కోరారు.

ఒక మెగాస్టార్ మరియు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త తమ వాట్సాప్ ద్వారా వారికి వచ్చిన ఫేక్ న్యూస్ ని జనాల్లోకి బలంగా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు పెద్ద మనుషులు తమ గౌరవం కాపాడుకోవాలని మేము వారి వాట్సాప్ ని తొలగించాలని కోరుతున్నామని మార్క్ జుకర్‌బర్గ్‌ను అభ్యర్థిస్తున్నామని ట్వీట్ చేసారు. గత నెలలో జనతా కర్ఫ్యూ సందర్భంగా అమితాబ్… ఆ రోజుని అమావశ్య తో పోల్చడం వివాదాస్పదంగా మారింది. కరోనావైరస్ మహమ్మారితో పోరాడటానికి పాత్రలు మోగించడం చప్పట్లు కొట్టడం ఎలా ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు.

ఆ తర్వాత ట్రోల్స్ రావడంతో ఆయన ఆ ట్వీట్ ని తొలగించారు. కొన్ని రోజుల తరువాత, కరోనావైరస్ మహమ్మారి మానవ మలమూత్రంలో వారాలపాటు ఉండగలదని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలిపింది. ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు చేసిన వెంటనే, ఏ సమయంలోనైనా “వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయి” అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. ఆన్‌లైన్ పిటిషన్‌లో ఇప్పటివరకు 700 మందికి పైగా సంతకం చేశారు. దీనిపై అమితాబ్ ఇప్పటి వరకు స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version