గత కొన్ని రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ,హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థానికి ముహూర్తం సెట్ అయిందని ప్రచారం కూడా జరుగుతోంది.. ఈ విషయంపై అటు మెగా ఫ్యామిలీ కానీ లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ కానీ స్పందించలేదు. కానీ తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ పైన ఒక అధికారిక ప్రకటన వెలువడినట్లు మెగా టీం సోషల్ మీడియా వేదికగా వీరి ఎంగేజ్మెంట్ డేట్ ని కన్ఫర్మ్ చేసినట్టుగా ఒక ఫోటో వైరల్ గా మారుతోంది.
జూన్ 9వ తేదీన వీరి నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలుస్తోంది.. కొంతమంది సన్నిహిత వర్గాల ద్వారా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ నిశ్చితార్థంలో మెగా హీరోలు చిరంజీవి ,రామ్ చరణ్ వంటి వారికి సినిమా డేట్ లో అడ్జస్ట్ ఆరోజు అవ్వడం చేత ఆ రోజున వీరీ నిశ్చితార్ధాన్ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆరోజు వివాహ తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. వివాహం కోసమే లావణ్య త్రిపాఠి కూడా సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం లావణ్య త్రిపాఠి తన పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కెరియర్ని వదిలి పెట్టాలని అనుకోవడం లేదని వివాహమైన కూడా సినిమాలు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళ్ ,తెలుగు భాషలలో పలు వెబ్ సిరీస్లలో నటిస్తోంది. వాటన్నిటిని పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వరుణ్-లావణ్య త్రిపాఠి 2017 లో మిస్టర్ సినిమాలో నటించారు. ఆ తర్వాతే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్క్ ఔట్ అయ్యి అంతరిక్షం సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరికి సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారుతోంది .ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.