వైఎస్ జగన్ భవితవ్యం ఇదే…. జ్యోతిష్కుడు రుద్ర కరణ్ ప్రతాప్ సంచలన ట్వీట్

-

రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అనే నినాదంతో బరిలో దిగుతున్నారు. దీనికోసం ఆరునెలల క్రితం నుంచే సన్నాహాలు మొదలు పెట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో జనంలోకి వెళ్లారు. గ్రామస్థాయిలో వైఎస్ఆర్సీపీ శాసన సభ్యులు మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకూ ఇందులో పాల్గొన్నారు. విజయవంతంగా ఈ కార్యక్రమం పూర్తయింది. తరువాత జగనన్నే మన భవిష్యత్ పేరుతో ఇంటింటికీ స్టిక్కర్లను అతికించారు. దీనికీ ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు.క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు ఇవ్వడం, ఇచ్చిన మాట తప్పకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రజలు జగన్ పట్ల సానుకూల దృక్పధంతో ఉన్నారు.

ఈ పరిణామాల మధ్య ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ ప్రతాప్ సంచలన ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మరోసారి అధికారంలోకి రాబోయేది వైసీపీ అని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ సారథ్యంలో ఏపీలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. పూర్తి కాలం పాటు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటారనీ స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ కి చెందిన కార్యకర్తలు కూడా జై జగన్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని రుద్ర కరణ్ ప్రతాప్ గతంలో అంచనా వేశారు. అందుకు తగ్గట్టే కర్ణాటక ఫలితాలు వెలువడ్డాయి. మే నెలలో బీజేపీకి అన్నీ చేదు అనుభవాలు ఎదురవుతాయని, ఆ పార్టీ ఎదురుదెబ్బలను చవి చూస్తుందంటూ హెచ్చరించారు.సరిగ్గా అలాంటి పరిణామాలే జరిగాయి. మరి ఏపీ రాజకీయాల్లో రుద్ర కరణ్ ప్రతాప్ జోస్యం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version