టైటిల్ లీకవడంతో మహేష్ బాబు ఫైర్ అయ్యారా ..వామ్మో నెక్స్ట్ ఏంటీ ..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సరిగ్గా 48 గంటల్లో సర్‌ప్రైజ్ రాబోతుంది. మే 31 న కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా మహేష్ తన కొత్త సినిమాని అధికారకంగా ప్రకటించబోతున్నాడు. ఇప్పటికే తన నెక్స్ట్సినిమా దర్శకుడు పరశురామ్ తో చేయబోతున్నాడని కన్‌ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.

 

 

అయితే ఈ సినిమాకి సర్కారి వారి పాట అనే టైటిల్ ని మహేష్ బృందం అనుకుంటున్నట్టు బయటికి వచ్చింది. అంతేకాదు ఇదే టైటిల్ ఖాయం అని మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా సంబరంగా చెప్పుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అసలు టైటిల్ ఇలా ఎలా బయటికి లీకయిందని మహేష్ షాకవుతున్నారట. అంతేకాదు టైటిల్ లీక్ విషయంలో తన పి ఆర్ టీం పై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది.

అయితే ఇలా ఒక సినిమాకి సంబంధించిన విషయాలు బయటకు రావడం సర్వ సాధారణం అయిపోయాయి. దాంతో యూనిట్ తో పాటు ఆడియన్స్ లోను కిక్ తగ్గుతోంది. ఇక ఈ సినిమాను బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలకు సంబంధించిన బ్యాగ్డ్రాప్ తో పరుశురామ్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. మహేష్ ఇమేజ్ కి తగ్గట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఓ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేశారని చెప్పుకుంటున్నారు. వరసగా బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటున్న మహేష్ ఈ సారి పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడట. అదే జరిగితే మహేష్ రేంజ్ ఎవరూ ఊహించలేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version