వారి దెబ్బకు భయపడిపోతున్న రాజమౌళి….??

-

టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ అనే హిస్టారికల్ మూవీని తీస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పలువురు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన ప్రముఖ నటులు నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఎన్టీఆర్ నటించిన ఒక వీడియో తో పాటు, ఒక పది రోజుల క్రితం ఒక పోస్టర్ సోషల్ మీడియా మాధ్యమాల్లో లీక్ అయి పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు ఆ విధముగా తప్పుడు పద్ధతుల్లో ఫోటోలు తీసి వాటిని నెట్ లో పెడుతున్నారని ఆగ్రహించిన రాజమౌళి, ఇకపై అటువంటివి రిపీట్ కాకుండా ఉండడానికి షూటింగ్ స్పాట్ కి వచ్చే వారికి కూడా కొన్ని నియమాలు పెడుతున్నారట.

 

అలానే హీరోలు సహా సినిమా యూనిట్ వారందరినీ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వంటివి తీసుకురాకూడదని ఆంక్షలు పెట్టి గట్టిగా అమలు చేస్తున్న రాజమౌళి, ఇకపై రాబోయే రోజుల్లో సినిమాకు సంబంధించి ఇటువంటివి బయటకు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అలానే తమ సినిమాకు పైరసీ కు సంబందించిన విషయాలపై కూడా ఇప్పటి నుండి ప్రత్యేక టీమ్ ని సిద్ధం చేసి, సినిమా హ్యాకర్ల బారిన పడకుండా జాగ్రత్త పడుతున్నారట. ఈ పరిస్థితి చూస్తుంటే లీక్ బాబుల దెబ్బకు రాజమౌళి కొంత భయపడుతున్నట్లు అర్ధం అవుతోందని అంటున్నారు….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version