బేబీ సినిమాతో వైష్ణవికి దక్కింది అంతేనా..?

-

ప్రముఖ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, ప్రముఖ యూట్యూబర్ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య నటించిన చిత్రం బేబీ. ఇందులో విరాజ్ అశ్విన్ కీలకపాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా, కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.. కేవలం రూ .10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే రూ.50 కోట్ల మేర కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది .ఈ సినిమాతో నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇందులో నటించిన నటీనటులకు ఏ రేంజ్ లో పారితోషకం లభించింది అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయంలోకి వెళితే.. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ కు 80 లక్షల రూపాయల పారితోషకం లభించగా.. సినిమాకే మెయిన్ పిల్లర్ గా నిలిచిన వైష్ణవి చైతన్యకు కేవలం రూ .30 లక్షలు మాత్రమే పారితోషకం ఇచ్చినట్లు సమాచారం. మరొకవైపు తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న విరాజ్ అశ్విన్ ఈ సినిమా కోసం రూ .20 లక్షలు మాత్రమే పారితోషకం తీసుకున్నారట. ఇంత తక్కువ పారితోషకం తీసుకున్నా సరే ఇందులో నటీనటులు మాత్రం తమ ప్రాణం పెట్టి నటించారు.

ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా నటించి చూసే ప్రేక్షకుడి మనసును హత్తుకున్న ఈ సినిమా భారీగా విజయాన్ని సాధించింది. ఇక ఆనంద దేవరకొండ సినీ కెరియర్ లో ఈ సినిమా మొదటి కమర్షియల్ హిట్గా నిలిచిందని చెప్పవచ్చు. మరొకవైపు వైష్ణవి చైతన్యకి కూడా భారీ పాపులారిటీ లభించింది. ఇక ఈ సినిమాతో ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని అభిమానుల సైతం ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news