కళ్యాణ్ రామ్ కు తన భార్యపై ఉన్న ప్రేమ చెప్పడానికి ఇది చాలదా..?

-

 తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉన్నది. ఇక అంతే కాకుండా ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక నందమూరి కుటుంబానికి సంబంధించి అభిమానులకు, వారి బంధువులకు ఎంతటి విలువనిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి నట వారసులలో ఒకరైన కళ్యాణ్ రామ్ కూడా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న బింబిసారా సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయింది.

ఈ కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ చేతికి ఉన్న ఒక పచ్చబొట్టు అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ చేతి పైన స్వాతి అనే ఒక పేరు పచ్చబొట్టు కనిపించింది. అయితే ఈ పేరు మాత్రం తన భార్యది. చాలా సంవత్సరాల క్రితం కళ్యాణ్ రామ్ ఈ పచ్చబొట్టును వేయించుకున్నారు. ఇక వీటితోపాటుగా తన కుటుంబానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా బయటికి వచ్చాయి కళ్యాణ్ రామ్ కుమారుడు సౌర్య రామ్, కూతురు తారక ఆదిత్య ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కళ్యాణ్ రామ్ తో స్వాతికి 2006 ఆగస్ట్ 10 న వివాహం జరిగింది.

తన భార్య పై కళ్యాణ్ రామ్ కి చాలా ఇష్టం ఉండడంతో ఆమె పేరు పచ్చబొట్టు వేయించుకున్నారట . ఇక స్వాతి తమ్ముడు హరి కళ్యాణ్.. ఇక కళ్యాణ్ రామ్ సినిమాలకు సంబంధించి మొదట క్రిటిక్ చెప్పేది కూడా ఆయనే అన్నట్లుగా సమాచారం.కళ్యాణ్ రామ్ కెరియర్ లోని ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి మరికొన్ని ప్లాపులుగా నిలిచాయి. ఇప్పటికే బింబీసార ట్రైలర్ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయమన్నట్లుగా ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇక తన సోదరుడు అయిన ఎన్టీఆర్ తో అప్పుడప్పుడు మాట్లాడడానికి తన ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటారు. ఇక కష్టాలలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ తన సినిమాలకు నిర్మాతగా కళ్యాణ్ రామ్ ని పెట్టుకొని మంచి లాభాలను తెచ్చి పెట్టేలా చేశాడు. దీంతో కళ్యాణ్ రామ్ నష్టపోయిన డబ్బులను తిరిగి వచ్చేలా చేశాడు ఎన్టీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version