బిగ్ బ్రేకింగ్ :  తెలుగు హీరోల మీద ఐటీ దాడులు ??

-

గత కొన్ని రోజుల నుండి దక్షిణ భారతదేశంలో ప్రముఖుల ఇళ్లపై అలాగే నటీనటుల పై హీరోయిన్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణాది రాజకీయాలలో సినిమా ఇండస్ట్రీలో పేరుగాంచిన వాళ్ల ఇళ్ల పై మరియు కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇటీవల కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో విజయ్ ఇంటిపై మరియు ఆయన కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి.

Image result for it rides

విజయ్ నటించిన బిగిల్ సినిమా విషయంలో ఐటీ అధికారులు సినిమా హీరో మరియు నిర్మాతని లెక్కలు అడిగినట్లు సమాచారం. దాదాపు 300 కోట్ల మేరకు ఐటీ అధికారులు విజయ దగ్గర నుండి ఆస్తుల రూపంలో గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వచ్చిన వార్తలలో వాస్తవం లేదని ఐటీ అధికారులు స్పష్టం చేశారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని మరికొన్ని ప్రాంగణాల్లో శోధనలు చేయాలని స్పష్టం చేశారు.

ఇదే తరుణంలో తెలుగు హీరోల మీద కూడా ఐటీ దాడులు త్వరలో జరగబోతున్నట్లు సమాచారం. అయితే ఒక్కసారిగా దక్షిణాదిలో ఈ విధంగా ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం చేయిస్తోందని హీరో లను లొంగదీసుకోవడానికి ఈ కుటిలమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయవిశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news