యూ ట్యూబ్ ఛాన‌ళ్ల‌తో దుమ్ములేపుతున్న జ‌బ‌ర్ద‌స్త్ న‌టులు

-

జ‌బ‌ర్ద‌స్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది త‌మ ట్యాలెంట్‌ను నిరూపించుకున్నారు. అంతే కాదు సినిమాల్లో కూడా అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నారు. ఇక సుడిగాలి సుధీర్‌, హైప‌ర్ ఆది, గెట‌ప్ శ్రీను లాంటి వాల్లు ఎంత ఫేమ‌స్ అయ్యారో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సుడిగాలి సుధీర్ ఏకంగా హీరో కూడా అయ్యాడు.

అయితే క్రేజ్‌ను వాడుకుని ఈ షోలో చేసేవారంతా ఇప్పుడు యూ ట్యూబ్ ఛాన‌ళ్లు పెట్టుకుంటున్నారు. ఇందులో వ్లాగ్స్ వీడియోలు పెడుతూ బాగా సంపాదిస్తున్నారు. త‌మ రోజువారీ ప‌నులు చేసుకుంటూ వాటినే వీడియోగాలుగా వ‌దులుతున్నారు.

నాగ‌బాబు, శ్రీముఖి, విష్ణుప్రియ‌, చ‌లాకీ చంటి, రామ్ ప్ర‌సాద్‌, న‌రేశ్‌, రాకేశ్‌, వ‌ర్షిణి, రోహిణి ఇలా అంద‌రూ యూట్యూబ్ ఛాన‌ళ్లు పెట్టుకుంటున్నారు. దాదాపు 22మందికి యూ ట్యూబ్ ఛాన‌ల్లు ఉన్నాయంటే వీరు ఏ రేంజ్‌లో క్రేజ్‌ను క్యాచ్ చేసుకుంటున్నారో తెలుస్తోంది. సోష‌ల్ మీడియా అకౌంట్ల‌తో ఈ ఛాన‌ళ్ల‌ను మ‌రింత పాపుల‌ర్ చేస్తున్నారు. ఎంతైనా వీరు ట్యాలెంట్ ప‌ర్స‌న్లే క‌దా.

Read more RELATED
Recommended to you

Exit mobile version