బాలీవుడ్ బాట ప‌ట్టిన జ‌గ్గూభాయ్‌.. ఎవ‌రితో అంటే?

జ‌గ‌ప‌తి బాబు అంటే ఒక‌ప్పుడు స్టార్ హీరో రేంజ్‌లో ఆయ‌న సినిమాలు ఉండేవి. కానీ ఆ త‌ర్వాత ఆయ‌న హీరోగా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో విల‌న్ పాత్ర‌లు చేస్తున్నారు. లెజెండ్ సినిమాలో రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన జ‌గ్గూభాయ్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్ట‌ర్‌గా రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయ‌న టాలీవుడ్‌తో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల సినిమాల్లో కూడా న‌టిస్తున్నారు.


సైత్‌లో ప్ర‌స్తుతం ఆయ‌న బాగా పాపుల‌ర్ అయిపోయాడు. కాగా సౌత్ లో ఏ ఇండ‌స్ట్రీ నుంచి ఆఫర్ వచ్చినా ఆయ‌న సై అంటున్నారు. అయితే ఇప్పుడు జగ్గుభాయ్ బాలీవుడ్ లోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్ జ‌గ‌ప‌తిబాబును త‌న సినిమా కోసం కోరిన్టు తెలుస్తోంది. జగపతిబాబును అక్ష‌య్ సినిమాలో విలన్ గా చేయ‌డానికి ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. కాగా జ‌గ‌ప‌తి బాబు క్యారెక్టర్ మాత్రంచాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుందంట‌. కాగా ఈ సినిమాకు దర్శక, నిర్మాతలు ఇంకా క‌న్ఫ‌ర్మ్ లేదు. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే బాలీవుడ్‌లో కూడా జ‌గ‌ప‌తికి తిరుగుండ‌దు.