దేవుడు వచ్చినా.. ఈటల ఓడిపోవడం ఖాయం !

-

ఈటల రాజేందర్ బై ఎలక్షన్ లో ఓడిపోవడం ఖాయం..ఆ దేవుడు కూడా ఆయనను గెలిపించలేడని తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో గుత్తా చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ ఎస్ పార్టీ బలంగా బలోపేతం అయిన పార్టీ అని..ఈటెల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని చురకలు అంటించారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప- హత్యలుండవు అని..ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ పడిపోయిందని… మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపికి పరాభవం ఎదురయ్యిందని కూడా పేర్కొన్నారు.

ఈటెల రాజేందర్ ఆత్మరక్షణ కోసం కాదని.. ఆస్తులు రక్షణ కోసమే బీజేపీలోకి వెళుతున్నారని మండిపడ్డారు. మరో 20 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. 2026 ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయని… నియోజకవర్గల డి- లిమిటేషన్ 2026లో పూర్తి అవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో మాత్రం ఇప్పుడున్న రిజర్వేషన్లు వర్తించే విధంగా ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం దూసుకుపోతుందని… 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news