భార్యతో కలిసి వెకేషన్స్ కి వెళ్ళిన జక్కన్న.. అక్కడ కూడా ఇదే పిచ్చా..?

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేసిన తర్వాత తాజాగా ఫ్యామిలీతో రిఫ్రెష్ అవ్వడానికి తన లైఫ్ పార్టనర్ రమా రాజమౌళితో కలిసి హ్యాపీగా వెకేషన్ ట్రిప్ వేశాడు. నార్వే టూర్ కి వెళ్ళిన రాజమౌళి అక్కడినుంచి తన భార్యతో గడుపుతున్న ప్రతి క్షణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.. కొంతకాలం టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిన జక్కన్న భార్య రమాతో పాటు సుదూర ప్రాంతమైన నార్వే దేశానికి వెళ్లి అక్కడ అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారు.


ఇక్కడ ఒక స్థలం ఉంది.. ఇక్కడి బరోక్ ని అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా హరియో నీరు, పెద్ద పెద్ద రాళ్లు.. అందమైన ప్రదేశం ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక దర్శకుడు రాజమౌళి ఆయన సతీమణి రమా కూడా ఇదే ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది.నార్వే లో ఉన్న ఆ అందమైన ప్రదేశం పేరు “ద పల్పిట్ రాక్”.. ఎప్పటినుంచో ఈ అందమైన ప్రదేశానికి రావాలనుకున్న రాజమౌళి.. మగధీర తీస్తున్నప్పుడు రీసర్చ్ టైం లో రాజమౌళి ఈ ప్రదేశాన్ని చూశాడట. ఇక ఇప్పుడు అదే ప్లేస్ కి భార్యతో కలిసి వెళ్లారు.

ఇంతకాలం ఎంత ప్రయత్నించినా కుదరలేదని.. అయితే అది ఇప్పుడు సాధ్యమైందని తన భార్యతో కలిసి ఈ సుందరమైన ప్రాంతాన్ని సందర్శించిన ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇది చూసిన నెటిజెన్లు భార్యతో వెకేషన్ కి వెళ్ళినట్టు లేదు కొత్త మూవీ కోసం లొకేషన్ వెతికే పనిలో పడ్డట్లు ఉంది ఎక్కడికి వెళ్లినా రాజమౌళి సినిమా పిచ్చి మాత్రం మారదు అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.మరికొంతమంది.. మేము ఇచ్చిన స్టోరీ చాలా బాగుంది.. సినిమా ఎప్పుడు చేస్తారు.. లొకేషన్ సెర్చ్ చేయడానికి నార్వే వెళ్లారా అంటూ కామెంట్లు చేస్తున్నారు . మొత్తానికి అయితే జక్కన్న షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.