అలనాటి క్లాసికల్ హిట్ సాంగ్ కు డాన్స్ ఇరగదీసిన జాన్వీ కపూర్….ఇంటర్నెట్ లో వైరల్…..!!

-

ఇటీవల హఠాత్తుగా మరణించిన దిగ్గజ అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఇప్పటికే రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఆమె జ్ఞాపకాలు సినీ ప్రియులను, ముఖ్యంగా ఆమె అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇక తన పెద్ద కూతురు జాన్వీ ని సినీ తెరపై చూడాలన్న కోరిక తీరకుండానే శ్రీదేవి అనంతలోకాలకు వెళ్లిపోయారు. అయితే శ్రీదేవి మరణం తరువాత జాన్వీ నటించిన తొలి సినిమా ధఢక్ రిలీజ్ అయి మంచి సక్సెస్ ని అందుకుంది.

నా తొలి సినిమా సక్సెస్ ని అమ్మ చూడలేకేపోయింది. కావున ఈ సినిమా సక్సెస్ ని ఆమెకు అంకింతం ఇస్తున్నట్లు అప్పట్లో జాన్వీ చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం గుంజన్ సక్సేనా సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జాన్వీ, ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఇంటరాక్ట్ అవుతూ, తన సినీ, వ్యక్తిగత విషయాలకు సంబంధించి పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇకపోతే నిన్న బ్లూ కలర్ అనార్కలి డ్రెస్ ధరించి, తన నృత్య శిక్షకురాలితో కలిసి దేవానంద్, వహీదా రహమాన్ కలిసి నటించిన అలనాటి బాలీవుడ్ క్లాసిక్ మూవీ అయిన గైడ్ సినిమాలోని

 

‘పియా తోసే నైనా లాగే రే’ సాంగ్ కు తనదైన రీతిలో అద్భుతంగా డాన్స్ అదరగొట్టిన వీడియోని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసింది జాన్వీ. మనం డాన్స్ చేసేటపుడు పాట సందర్భాన్ని బ్యాలన్స్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తే, చివరివరకు కూడా ఆ ఫీల్ అలానే ఉంటుందని జాన్వీ తన పోస్ట్ ద్వారా తెలిపింది. ఇక ప్రస్తుతం ఆమె డ్యాన్స్ చేస్తున్న ఆ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version