జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామాల చోటు చేసుకుంది. నేడు మూడో రోజు పోలీస్ కస్టడీకి జానీ మాస్టర్ వెళ్లనున్నారు. నిన్న ఉదయం జానీ మాస్టర్‌కు గోల్కొండ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాది సమక్షంలో జానీ మాస్టర్ ను విచారణ చేశారు.
ఔట్‌డోర్ షూటింగ్స్ సమయంలో జరిగిన లైంగిక దాదులపై జానీ మాస్టర్ ను ప్రశ్నలు సంధించారు పోలీసులు. అనంతరం జానీ మాస్టర్ స్టేట్‌మెంట్ నమోదు చేసుకున్న పోలీసులు,…నేడు మూడో రోజు పోలీస్ కస్టడీకి జానీ మాస్టర్ తీసుకోనున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నేడు మరింత లోతుగా విచారణ చేయనున్నారు. కాగా, ఓ డ్యాన్సర్ ను రేప్ చేసిన కేసులో జాని మాస్టర్ ఇరుక్కున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా జాని మాస్టర్ కు విధించింది.