భార్య చేతిలో మోసపోయిన జీన్స్ హీరో.. కట్ చేస్తే..!

-

కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్యాగరాజన్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరో ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జీన్స్ , జోడి వంటి చిత్రాలతో స్టార్ హీరో అనిపించుకున్న ప్రశాంత్ ఆ తర్వాత కాలంలో వ్యక్తిగత కారణాలవల్ల సినీ కెరియర్ కి దూరమయ్యారు. ఇదిలా ఉండగా ఆయనకు సంబంధించిన ఎన్నో వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తన భార్య చేతిలో మోసపోయారు అన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

2005లో వ్యాపారవేత్త కుమార్తె గృహలక్ష్మితో ప్రశాంత్ వివాహం జరిగింది. వారిద్దరికీ ఒక పాప కూడా జన్మించారు. అయితే అంతా బాగుంది అనుకునే లోపే కొద్ది రోజులకు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెళ్లైన మూడేళ్లకే ఇద్దరు విడిపోయారు. తర్వాత గృహలక్ష్మి తన పుట్టింటికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక పాపను చూడడానికి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్లినా సరే వారు అనుమతించలేదు. ఇక తన భార్యను తిరిగి పొందడానికి కోర్టును ఆశ్రయించినా.. అది వారి మధ్య మరింత వివాదాన్ని సృష్టించింది. అంతలోనే మరొక అనుకోని ఘటన చోటుచేసుకుంది.

అదేమిటంటే ప్రశాంత్  ముందే గృహలక్ష్మి నారాయణన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందట. గృహలక్ష్మి తనను 1998 లోనే పెళ్లాడింది అని అతడు వాదించాడు. దీంతో విడాకుల కోసం హీరో ప్రశాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. ఇక కొద్ది రోజుల తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేసిందని సమాచారం. ఇకపోతే తన కూతుర్ని తన దగ్గర వదిలేయాలని ప్రశాంత్ కోరినప్పటికీ కూడా కోర్టు అంగీకరించలేదు. అలా వైవాహిక జీవితంలో విడాకులు తీసుకునే సమయంలో వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణల కారణంగా ప్రశాంత్ ఇమేజ్ కూడా భారీగా దెబ్బతినింది. దాంతో వెండితెర నుంచి ఆయన దూరమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version