సాధారణంగా అబ్బాయిలకు గడ్డం వస్తుంది. అమ్మాయిలకు గడ్డం రావడం అనేది చాలా అరుదు. ఒకవేళ వచ్చినా ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఓ చోట మహిళకు గడ్డం రావడమే కాదు.. పొడవైన గడ్డంతో గిన్నీస్ రికార్డ్ సృష్టింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. మిషిగాన్కు చెందిన ఎరిన్ హనీకట్కు చిన్నప్పటి నుంచే జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి. దీంతో ఆమె 13ఏళ్లు ఉన్నప్పుడే ఆమెకు గడ్డం వచ్చింది.
అమెరికాలోని మిచిగాన్కు చెందిన 38 ఏళ్ల ఎరిన్ హనీకట్ అత్యంత పొడవైన గడ్డంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. హార్మోన్ల సమస్య కారణంగా హనీకట్కు అధికంగా జుట్టు పెరగడం స్టార్ట్ అయింది. దీంతో ఆమె ముఖంపై పెరిగిన గడ్డం.. 11.8 అంగుళాలకు చేరుకుంది. గతంలో ఈ రికార్డు వివియన్ వీలర్ (10.04 అంగుళాలు) పేరిట ఉండగా.. హనీకట్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.
అబ్బాయిల్లాగ గడ్డం రావడంతో ఎరిన్ తీవ్ర ఆందోళన చెంది.. రోజుకు మూడు, నాలుగు సార్లు షేవింగ్ చేసుకునేది. గడ్డాన్ని తొలగించేందుకు రకరకాల క్రీమ్లను వాడేది. అయినా వాటితో ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. ఆ తర్వాత ఆమెకు ఐ స్ట్రోక్ వచ్చి పాక్షికంగా దృష్టిని కోల్పోయింది. దాంతో షేవ్, చేయడం, క్రీమ్స్ వాడడం ఆపేశారు. అయితే తీవ్ర మానసిక సంఘర్షణకు గురైన ఆమెకు స్నేహితులు, బంధువులు భరోసా కల్పించారు.