సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ వయసు పైబడుతున్నప్పటికీ వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారని చెప్పవచ్చు.
అయితే, నటి జీవిత 30 ఏళ్ల తర్వాత వెండి తెరపై రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆమె డైరెక్టర్, నిర్మాతగా సినిమాలు నిర్మించారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీలో అతనికి సోదరిగా నటించనున్నట్లు సమాచారం. రజనీ కుమార్తె ఐశ్వర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 7న మూవీ షూటింగ్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మూవీలో రజనీకాంత్, విష్ణు విశాల్, జీవిత నటించనున్నట్లు తెలిపారు.