War 2 Review : వార్ 2 – ఉత్కంఠ రేపే యాక్షన్ థ్రిల్లర్..

-

బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ తాజ చిత్రం వార్ 2. ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడం, ఈ చిత్రంలో హృతిక్ రోషన్,జూనియర్ ఎన్టీఆర్ కలిసినటించడంపై సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా ఫై అంచనాలు పెంచేసింది. ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ అయింది. ఇదే రోజు రజనీకాంత్ కూలి మూవీ రిలీజ్ కానుండటం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా, లేదా అనేది ఈ రివ్యూ లో చూద్దాం..

వార్ 2 కథ : మాజీ రా ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) ఒకప్పుడు దేశం కోసం ప్రాణం పెట్టినవాడు ఇప్పుడు వరుసగా దేశంలోని బడా బాబులను చంపుతూ హంతకుడిగా మారతాడు. ఈ రహస్య చర్యల వెనుక ఉన్నది కలి అనే అజ్ఞాతశక్తి భారత దేశాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని కలికి ఒక ఘోరమైన టాస్క్ ను కబీర్ కు ఇస్తాడు.కలి ఆజ్ఞను పాటిస్తూ తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుద్ర సుతోష్ రానా ను కబీర్ చంపేస్తాడు. ఈ ఒక్క హత్యతో దేశం ఉల్లిక్కిపడుతుంది. కబీర్ కోసం రా భారత ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది అతని పట్టుకోవడానికి రంగంలో దిగుతుంది రా ప్రత్యేక బృందం దానికి న్యాయకత్వం వహించేది మేజర్ విక్రమ్ చలపతి (జూనియర్ ఎన్టీఆర్) ఇదిలా ఉండగా తండ్రిని కోల్పోయిన వింగ్ కమాండ్ కావ్య (కియారా అద్వానీ) కబీర్ పై పగతో రగిలిపోతుంది.

కానీ ఆట ఇక్కడితో ఆగదు కబీర్ కు విక్రమ్ మీద అనుమానం పెరుగుతుంది ఆ తర్వాత బయటపడే నిజం అన్ని టికి సమాధానం ఇస్తుంది. కబీర్ ఎందుకు దేశద్రోహి అయ్యాడు? సునీల్ లుద్ర ఎందుకు చంపాడు? విక్రమ్, కబీర్, కావ్య మధ్య సంబంధం ఏంటి? కలి గ్యాంగ్ ఇండియాను ఎందుకు లక్ష్యంగా పెట్టుకుంటుంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మూవీ ని  వీక్షించాలి ..

Jr NTR – Hrithik War 2 Movie Review in Telugu
Jr NTR – Hrithik War 2 Movie Review in Telugu

నటీనటులు : ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అనిల్ కపూర్, అసుతోష్ రాణా, కియారా అద్వానీ, తదితరులు..

నిర్మాణ సంస్థ : యష్ రాజ్ ఫిలిమ్స్..

దర్శకత్వం: అయాన్ ముఖర్జీ

నిర్మాత: ఆదిత్య చోప్రా

సంగీతం: ప్రీతమ్ (పాటలు) సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార

విడుదల తేదీ: ఆగస్టు 14, 2025

ఎలావుందంటే : స్పై యాక్షన్ థిల్లర్ మూవీ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యాక్షన్, విన్యాసాలు ఊహించని మలుపులతో ఆధ్యాంతం ఆకట్టుకుంది. సాధారణ ప్రేక్షకుడి దృష్టి కోణంతో ఈ సినిమాలో ఊహించని ట్విస్టులను యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించారు. వార్ 2 లో అవి రెండు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే సినిమాలో కథ, కథనాలు పెద్దగా ఆసక్తి కలిగించవు. దర్శకుడు అనుకున్న ట్విస్టులు, సీన్లు ఈజీగా ప్రేక్షకుడి ఊహించవచ్చు. VFX విజువల్స్ పరంగా సినిమా ఇంకొంత మేర ఆకట్టుకుంటే బాగుండేది ఒకటి రెండు యాక్షన్ సీన్లు తప్ప మిగిలినవన్నీ రొటీన్ గానే ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు.ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు విమానంపై యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలిచాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఫ్లాష్ బ్యాక్ ఆకట్టుకుంటుంది. లాస్ట్ లో వచ్చే క్లైమాక్స్ ఫైట్ అధ్యంతం అలరిస్తుంది.

ప్లస్ పాయింట్స్ : హీరోల మధ్య వచ్చే యాక్షన్ సీన్స్, ఊహించని ట్విస్టులు.. హీరోల నటన

బలహీనతలు: స్లోగా సాగే కథనం, విలన్ పాత్ర, కొత్తదనం లేని కథ.

రేటింగ్ : 3/5

(గమనిక:ఈ సమీక్ష కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Read more RELATED
Recommended to you

Latest news