ఏపీలో రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం కానుంది. స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించిన తర్వాత జీరో ఫేర్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. విజయవాడ PN బస్టాండ్ లో సాయంత్రం ఐదు గంటల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తారు. కాగా, నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి, తిరుమల, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సులలో స్త్రీ శక్తి పథకం వర్తించదు.

ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గతంలోనే వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం రేపటి నుంచి స్త్రీ శక్తి పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నారు. దీంతో ఏపీలోని మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి చార్జీలు లేకుండా ఇతర ప్రదేశాలకు చేరుకోవచ్చని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.