ఆ పది నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలవాలి.. పట్టు నిలుపుకోవాలి.. పార్టీకి తిరుగు లేదని మరోసారి నిరూపించాలి.. ప్రస్తుతం ఇవే చర్చలు బీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో జరుగుతోంది.. ఈ టాస్క్ ను సక్సెస్ పుల్ గా ఫినీష్ చెయ్యడానికి అగ్రనాయకత్వం బరిలోకి దిగింది.. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయనే ధీమాలో టిఆర్ఎస్ పార్టీ ఉంది.. ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి.. మరోసారి కారు జోరును కాంగ్రెస్ కి రుచి చూపించాలని తాతహలాడుతోంది.. అందులో భాగంగా పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆదేశాలతో.. ఆయా నియోజకవర్గాల్లో ఉండే బలమైన నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున గెలిచి హస్తం గూటికి చేరిన… పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది.. హైకోర్టు నుంచి సానుకూలంగా తీర్పు రావడంతో ఉప ఎన్నికల ఫై పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న పది నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించింది.ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలను , శ్రేణులను సమన్వయం చేసుకుని పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది.
ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడివిడిగా సమావేశం నిర్వహిస్తున్నారు.. గెలుపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.. ఉప ఎన్నికలు వస్తే ఎవరిని బరిలోకి దింపాలి.. ఎవరు ఓటర్లును ప్రభావం చూపే లీడర్లు అన్నదానిపై సమాలోచనలు జరుపుతున్నారట.. క్యాడర్ కు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న విధానాలను ఇప్పటి నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు ఆదేశాలిచ్చారని పార్టీలో చర్చ నడుస్తోంది..
తమ ప్రభుత్వంలో నమ్మకంగా ఉంటూ.. పదవులు అనుభవించిన వారిని మొదటగా ఫోకస్ చెయ్యాలని పార్టీ భావిస్తోందట.. ఈ వ్యవహారంపై అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలతో కేటీఆర్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.. పదినియోజకవర్గాల్లో మళ్లీ గెలిచి.. బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది.. మరోపక్క కాంగ్రెస్ కూడా ఉప ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి అనేదానిపై సమాలోచనలు జరుపుతోంది.. ఉప ఎన్నికలు వస్తేనే తమకు మేలనే భావనలో కాంగ్రెస్ ఉందట.. మొత్తంగా ఉప ఎన్నికలు వస్తే ఎవరికి లాభమో.. ఎవరి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో చూడాలి..