కాంతారా సీక్వెల్ కాదు! ప్రీ క్వెల్ అదిరిపోయే లెవల్లో.!

డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన  కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటున్న సంగతి అందరికి తెలిసిందే. దీపావళి కు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా కూడా, ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో విపరీత మైన కలెక్షన్లు వసూలు చేసింది. తెలుగు సినిమాలు అన్నీ కాంతారా చేతిలో ఓడిపోయా యి ఇప్పటికే పెట్టుబడికి ఎన్నో రెట్లు అధికంగా డబ్బులు రాబట్టింది.

సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని , ఈ సినిమా  చూస్తున్నంత సేపు మరో లోకంలో వున్నట్లుగా అనిపించిందని,అలాగే క్లైమాక్స్ లో గూస్ బంప్స్ వచ్చి ఒళ్ళు జలదరించింది అని చాలా మంది సెలబ్రిటీలు కాంతారా ఎక్స్పీరియన్స్ ను కళ్ళకు కట్టినట్లు గా చెప్పారు. ఇక మామూలు ఆడియన్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్ చవి చూశారు.ఇక ఓ టి టి లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది.

తాజాగా గత వారం వరల్డ్ ప్రీమియర్ గా మా టీవీ లో  12.3 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అని చెప్పాలి. బుల్లితెర పై కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అద్బుతం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డు రేసులో చివరి మెట్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం రెండో భాగం కోసం స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు  తెలుస్తోంది.ఈ నేపథ్యంలో హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కాంతార మళ్లీ రాబోతుంది అంటూ స్పష్టం చేశాడుఆయన మాటలను బట్టి కాంతార సినిమాకు సీక్వెల్ కాకుండా ప్రీ క్వెల్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనిని బట్టి కాంతార సినిమా కు ముందు జరిగే కథ ను కొత్త కాంతారలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎక్కువ బడ్జెట్ తో గ్రాఫిక్స్ అదిరి పోయేలా ఉంటుందని అంటున్నారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?