మరోవైపు.. భూకంపం ధాటికి కకావికలమైన తుర్కియే, సిరియాపై ప్రపంచదేశాలు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి. సాయం అందిస్తామంటూ ముందుకు వచ్చి.. రెస్క్యూ బృందాలతోపాటు వైద్య సిబ్బందిని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపిస్తున్నాయి. ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న మోదీ.. టర్కీకి 100 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్లను పంపాలని ఆదేశించారు. వీటితో పాటు టర్కీకి సహాయ సామగ్రి, వైద్య బృందాలు పంపించాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
టర్కీ, సిరియాల్లో భూకంపం.. 1600 మృతి.. రెస్క్యూ టీమ్స్ పంపిన మోదీ
-