కల్కి జోరు మామూలుగా లేదుగా.. మూడోరోజూ 12.8లక్షల టికెట్స్ సోల్డ్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద క్రేజీ వసూళ్లతో దూసుకుపోతుంది. జూన్ 27న రిలీజైన ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరుసగా మూడోరోజు హౌస్ఫుల్ షోస్తో రన్ అవుతూ నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. గురువారం రిలీజైన ఈ సినిమాకు వరుసగా మూడో రోజూ క్రేజ్ తగ్గలేదు. మూడో రోజున బుక్ మై షో లో 24గంటల్లోనే 1.28 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయట. ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాకు మూడోరోజున ఇన్ని టికెట్లు అమ్ముడుపోలేదట.

ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో పాటు బిగ్బీ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోణ్, దిశా పటానీ, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పాత్ర ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. మరోవైపు ముందుగా అనౌన్స్ చేయకపోయినా సినిమా రిలీజ్ అయ్యాక అందులో మృనాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండను చూపించి సర్‌ప్రైజ్ చేశారు.గెస్ట్ రోల్స్లో కనిపించిన రామ్ గోపాల్ వర్మ , రాజమౌళి తప్పించి మిగతా వాళ్లంతా స్టోరీలో భాగంగానే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version